Andhra Pradesh: విజయవాడ సీపీగా ద్వారకా తిరుమలరావు, విశాఖకు మహేష్ చంద్ర లడ్డా
- తొమ్మిది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
- విజయవాడ అడిషనల్ సీపీగా టి.యోగానంద్
- విజయవాడ క్రైమ్స్ డీసీపీగా బి.రాజకుమారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన విజయవాడ పోలీస్ కమిషనర్ గా ప్రస్తుతం సీఐడీ చీఫ్ గా ఉన్న ద్వారకా తిరుమల రావును నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న మహేశ్ చంద్ర లడ్డాను నియమించింది.
వీరితో పాటు మరో ఏడుగురిని బదిలీ చేసింది. టి.యోగానంద్ ను విజయవాడ అడిషనల్ సీపీగా, టి.రవికుమార్ మూర్తిని ఏలూరు రేంజ్ డీఐజీగా, డా. షేముషి బాజ్ పాయ్ ని రాజమండ్రి అర్బన్ ఎస్పీగా, బి.రాజకుమారిని విజయవాడ క్రైమ్స్ డీసీపీగా, బి.కృష్ణారావును తుళ్లూరు ఏఎస్పీగా, రాహుల్ దేవ్ సింగ్ ను రంపచోడవరం ఏఎస్పీగా, అజితా వేజెండ్లను రాజమండ్రి అర్బన్ ఏఎస్పీగా బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది.