Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. అమీర్‌పేటలో నిలిచిన వాహనాల రాకపోకలు
- ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం
- ఈరోజు రేపు తెలంగాణకు వర్ష సూచన
- పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట, సనత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షం కారణంగా రోడ్డుపై నీరు చేరడంతో అమీర్‌పేటలో వాహనాల రాకపోకలు నిలిచాయి. కాగా, ఉత్తర మధ్యప్రదేశ్ పరిసరాల్లో 2.1 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా, ఒడిశా పరిసరాల్లో 7.6 కి.మీల ఎత్తులోనూ అది కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
5.8 కి.మీల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, వీటి ప్రభావంగా తెలంగాణలో ఈరోజు, రేపు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కొమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అన్నారు.