devenineni: దేవినేని ఉమ మంత్రిగా ఉంటూ ఇసుక దోపిడీకి సహకరిస్తున్నారు: వైసీపీ నేత పార్థసారథి ఆరోపణ

  • ముడుపుల కోసమే ‘పట్టిసీమ’ నిర్మించినట్టుగా ఉంది
  • చేతకాని దద్దమ్మ దేవినేని
  • ఏపీకి బీజేపీ చేసిన అన్యాయానికి టీడీపీ వంతపాడింది

ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమపై వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఇసుక దోపిడీ చేసే వారికి సహకరిస్తున్నారని, ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించినట్టుగా ఉందని ఆరోపించారు. దేవినేని కృష్ణా జిల్లాకు పట్టిన దరిద్రమని, చేతకాని దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ-టీడీపీలపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీకి ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేదని, ఏపీకి బీజేపీ చేసిన అన్యాయానికి టీడీపీ వంతపాడిందని విమర్శించారు. బీజేపీని ప్రశ్నించేందుకు టీడీపీ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని, నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే టీడీపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News