: సీఎంపై ఎంపీ వివేక్ గరంగరం


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై మొదటి నుంచీ అసంతృప్త గళం వినిపిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ వివేక్ ఈ రోజు స్పీడు పెంచారు. సీఎం తన పట్ల వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నారని వివేక్ ఆరోపించారు. తాను టీఆర్ఎస్ లో చేరతానంటూ అసత్యం ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి, సమైక్యవాదులను ఉసిగొల్పుతూ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని అన్నారు. సింగరేణిలో వైద్య కళాశాల రాకుండా అడ్డుకున్నారని కూడా ఆరోపించారు.

  • Loading...

More Telugu News