Chandrababu: సముద్రం మాదిరిగా దళితులందరూ ఒక్కచోట చేరారు.. ఇదొక చరిత్ర: చంద్రబాబు

  • నెల్లూరులో దళిత తేజం-టీడీపీ ముగింపు కార్యక్రమం
  • 83 రోజులు అన్ని దళిత వాడల్లో మేము పర్యటించాం
  • లక్షల మంది సమక్షంలో చివరి రోజున సభ నిర్వహిస్తున్నాం
  • దళిత సంక్షేమం కోసం ఈ ఏడాది రూ.11,500 కోట్ల ఖర్చు

సముద్రం మాదిరిగా దళితులందరూ ఒక్కచోట చేరారని, ఇదొక చరిత్రని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించతగ్గ రోజని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరులో దళిత తేజం-టీడీపీ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... 'దళితులు అన్ని రంగాల్లో పై కొచ్చే వరకు అండగా ఉంటాను. దళిత తేజం కార్యక్రమం మీకోసమే.. 83 రోజులు అన్ని దళిత వాడల్లో మేము పర్యటించాం. లక్షల మంది సమక్షంలో చివరి రోజున ఇలా సభ నిర్వహిస్తున్నాం' అని అన్నారు.

షెడ్యూల్డ్‌ కులాలకు 75 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. దళిత సంక్షేమం కోసం ఈ ఏడాది రూ.11,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, తాము ప్రతి ఎస్సీ కాలనీలో సిమెంటు రోడ్లు వేస్తున్నామని అన్నారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు. దళితులపై దాడులు ఆగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు దళితులను ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్‌పై చర్చ సందర్భంగా జగన్‌ సభను బహిష్కరించారని అన్నారు. దళితులకు ద్రోహం చేసేలా ఎన్డీఏకి జగన్‌ దాసోహమయ్యారని, వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రతి ఒక్క దళితుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే పార్టీ టీడీపీ అని అన్నారు.

  • Loading...

More Telugu News