: కొణతాలకు ద్వారాలు తెరుస్తున్న అధికార పార్టీ


సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు వైఎస్సార్సీపీలో చేరడంతో కొణతాల వర్గం అసమ్మతి రాగం అందుకున్న సంగతి తెలిసిందే. అనకాపల్లి నియోజకవర్గం సీటు ఆశిస్తున్న కొణతాల సోదరులకు.. దాడి రాకతో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దాడి కూడా అనకాపల్లిలో చక్రం తిప్పాలని భావిస్తుండడమే వారి అసంతృప్తికి కారణం. దీంతో, దాడి విషయం పునరాలోచించాలని కొణతాల సోదరులు జగన్ పార్టీకి అల్టిమేటం విధించారు. లేకపోతే పార్టీని వీడతామని హెచ్చరించారు.

వైఎస్సార్సీపీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం ఇప్పుడు కొణతాల సోదరులను ఆలోచనలో పడేస్తోంది. దీంతో, వారు ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరం వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కొణతాల రామకృష్ణ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మనిషే అని కేంద్ర మంత్రి పురందేశ్వరి తాజాగా వ్యాఖ్యానించారు. పార్టీలోకి వస్తామంటే ఆయనకు కాంగ్రెస్ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆమె అన్నారు. దీన్నిబట్టి కొణతాలకు కాంగ్రెస్ పార్టీ అన్యాపదేశంగా ఆహ్వానం పంపుతున్నట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News