: రైల్వే మంత్రి రాజీనామాకు కౌంట్ డౌన్!


లంచం వ్యవహారంలో ఆరోపణలెదుర్కొంటున్న రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ రాజీనామా చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మేనల్లుడు విజయ్ సింగ్లా ఓ అధికారికి రైల్వే బోర్డులో స్థానం కల్పిస్తానని రూ. 90 లక్షలు లంచం స్వీకరించడం బన్సల్ మెడకు చుట్టుకుంది. ప్రస్తుతం ఈ ముడుపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. అప్పటి నుంచి బన్సల్ విధులకు దూరంగా ఉంటున్నారు. పైగా, గురువారం ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు. అధికారిక వాహనాన్ని కూడా పక్కనబెట్టి స్వంత వాహనంలో బన్సల్ బయటికివెళ్ళడంతో, పదవి నుంచి వైదొలుగుతారన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

  • Loading...

More Telugu News