: మృతులు 1000 దాటారు


బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో కూలిన బహుళ అంతస్తుల భవనం నుంచి ఒక్కరోజులోనే 120 మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఈ భారీ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య శుక్రవారం ఉదయానికి 1021కి చేరింది. ఏప్రిల్ 24న 11 అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇందులో పూర్తిగా వస్త్ర కర్మాగారాలు నడుస్తున్నాయి. ప్రమాదం తర్వాత సహాయక దళాలు 2,500 మందిని కాపాడాయి. నేటికీ అక్కడ శిధిలాల వెలికితీత పూర్తి కాలేదు. శిధిలాలను తొలగిస్తున్న కొద్దీ శవాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో ఇంకెంత మంది ఈ ప్రమాదంలో బలై ఉంటారోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.

  • Loading...

More Telugu News