Chandrababu: రాష్ట్ర విభజనను ఉత్సాహంగా జరుపుకోలేం: చంద్రబాబు

  • రేపు నవ నిర్మాణ దీక్ష
  • విభజన జరిగిన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
  • విభజన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి 
  • ప్రజల్లో ఓ సంకల్పాన్ని తెచ్చేందుకే నవ నిర్మాణ దీక్ష

ఏపీ ప్రభుత్వం రేపు నిర్వహించనున్న నవ నిర్మాణ దీక్షకు సర్వం సిద్ధమైంది. విజయవాడ బెంజిసర్కిల్‌లో రేపు ఉదయం 9 గంటల నుంచి నవనిర్మాణ దీక్ష ప్రారంభం కానుంది. ఈ విషయంపై అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఉత్సాహంగా జరుపుకోలేమని, విభజన జరిగిన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

ప్రతి ఏడాది నవ నిర్మాణ దీక్ష చేసి అప్పట్లో జరిగిన పరిస్థితులను, ఇప్పుడు జరుగుతోన్న పరిణామాలను ఓ సారి అధ్యయనం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. విభజన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని, ప్రజల్లో ఓ సంకల్పాన్ని తెచ్చేందుకే నవ నిర్మాణ దీక్ష చేస్తున్నామని అన్నారు. 5 కోట్ల మంది చేయాల్సిన పవిత్ర కార్యక్రమం నవనిర్మాణ దీక్ష అని పేర్కొన్నారు.

విభజన సమయంలో ప్రతి ఒక్కరిలో ఆవేదన నెలకొందని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా అభివృద్ధి ఆగడానికి వీల్లేదని, సంక్షేమ కార్యక్రమాలు ఆగడానికి వీల్లేదని అన్నారు. కేంద్ర సర్కారు సహకరించడం లేదని నిలదీస్తే కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.                           

  • Loading...

More Telugu News