Telangana: అవినీతిలో ‘తెలంగాణ’ రెండో స్థానంలో ఉంది: వీహెచ్

  • సీఎంఎస్ విడుదల చేసిన అవినీతి అధ్యయన నివేదిక
  • ఈ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది
  • ‘తెలంగాణ’లో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి

సీఎంఎస్ విడుదల చేసిన అవినీతి అధ్యయన నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి రెండో స్థానం రావడాన్ని టీ-సర్కార్ ఎలా సమర్థించుకుంటుందని సీనియర్ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ నివేదిక చెంపపెట్టులాంటిదని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా అవినీతిలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందంటే, ఏ మేరకు అవినీతి జరుగుతుందో అర్థమవుతోందని, ఈ విషయమై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రగల్భాలు పలికినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News