samanta: రామలక్ష్మిగానే కాదు రతీదేవిగాను సమంత అదరగొట్టేసిందట!

  • 'రంగస్థలం'తో హిట్ కొట్టేసిన సమంత 
  • 'ఇరుంబు తిరై'తో తమిళంలోను సక్సెస్ సొంతం 
  • రిక్వెస్ట్ కాదు .. డిమాండ్ అంటోన్న సమంత  

ఈ ఏడాది సమంతకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆమె నటించిన 'రంగస్థలం' .. 'మహానటి' .. 'ఇరుంబు తిరై' చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. చాలా తక్కువ గ్యాప్ లో వచ్చిన ఈ సినిమాలతో సమంత హ్యాట్రిక్ హిట్ కొట్టడం విశేషంగా చెప్పుకుంటున్నారు. 'ఇరుంబు తిరై' చిత్రంలో సమంత పోషించిన రతీదేవి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ ఆంగ్ల దినపత్రిక ఈ సినిమా రివ్యూలో సమంత పాత్రను గురించి ప్రస్తావిస్తూ , హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత కలిగిన పాత్రలు లభించని ఈ కాలంలో, రతీదేవి వంటి పాత్ర సమంతకి దక్కడం విశేషమని పేర్కొంది. 'రంగస్థలం'లో రామలక్ష్మి గానే కాదు .. 'ఇరుంబు తిరై'లో రతీదేవి గా అదరగొట్టేసిందని రాసుకొచ్చారు. ఈ రివ్యూ పట్ల సమంత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. " ఇప్పుడు హీరోయిన్లకు మంచి పాత్రలనేవి ఓ రిక్వెస్ట్ కాదు .. ఓ డిమాండ్. అవకాశం వస్తే విజృంభించడానికి చాలామంది సిద్ధంగా వున్నారు" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. 

  • Loading...

More Telugu News