: ఒబామాకు స్టెప్పులు నేర్పిన కుమార్తెలు
బరాక్ ఒబామా.. ఎంత అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు అయినా ఆయనకీ ఓ కుటుంబం ఉంటుంది, కొన్ని సరదాలు ఉంటాయి. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా పలు వేదికలపై నుంచి తెలిపారు కూడా. భార్యాపిల్లల కోసం సమయం కేటాయించడంలో ఎప్పుడూ రాజీపడబోనన్నారు. అలా ఉల్లాసంగా గడిపిన క్షణాల్లో తాను కొన్ని విలక్షణ స్టెప్పులు నేర్చుకున్నానని ఒబామా చెబుతున్నారు. కుమార్తెలు మాలియా (14), సాషా (11)లు తనకు 'గాంగ్నమ్ స్టైల్' స్టెప్పులు నేర్పారని గర్వంగా చెప్పారు. దక్షిణకొరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హేతో సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు ఒబామా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ కొరియా సంస్కృతి ఇప్పుడు ప్రపంచవ్యాపితమవుతోందని కొనియాడారు.