Andhra Pradesh: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం లేదు : వీహెచ్

  • అట్రాసిటీ చట్టం పరిరక్షణ సభలకు అనుమతివ్వాలి
  • యడ్యూరప్ప, ‘గాలి’ సోదరులకు బీజేపీ టిక్కెట్లివ్వడం దారుణం
  • కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అట్రాసిటీ చట్టం పరిరక్షణ నిమిత్తం గుంటూరు, వరంగల్ లో తలపెట్టిన సభలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వాలని కోరారు. అవినీతిపరులైన యడ్యూరప్ప, ‘గాలి’ సోదరులకు టిక్కెట్లు ఇచ్చిన బీజేపీకి నీతి గురించి ప్రస్తావించే అర్హత కూడా లేదని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News