: గ్రీన్ ఫీల్డ్ భూములలో అక్రమ కట్టడాల కూల్చివేత


హైదరాబాద్ నగరంలోని అల్వాల్ సమీపంలో ఉన్న వివాదాస్పద గ్రీన్ ఫీల్డ్ భూములలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఈ భూముల వివాదంపై కోర్టులో రెండేళ్లుగా కేసు నడుస్తోంది. ఈ కాలంలో ఇక్కడ వెలసిన అక్రమ కట్టడాలను ఈ రోజు రెవెన్యూ అధికారులు భద్రత నడుమ కూల్చేస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు కూలివేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్రమ కట్టడాలను కూల్చివేసే విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని శంకర్రావు సోదరుడు దయానంద్ మీడియాకు తెలిపారు.

ఈ భూములపై స్థానికులకు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకు మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. భూముల క్రమబద్ధీకరణకు శంకర్రావు అడ్డుపడ్డారంటూ వారు లోగడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగానే ఇటీవల శంకర్రావును పోలీసులు అదుపులోకి తీసుకుని, అస్వస్థత కారణంగా తర్వాత ఆయనను ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News