Chandrababu: రిటైర్ అయిన కొందరు పుస్తకాలు రాస్తున్నారు.. ప్రభుత్వంపై బురద చల్లే పని చేస్తున్నారు!: చంద్రబాబు ఆగ్రహం

  • ఇక్కడ పనిచేస్తారు
  • రిటైర్మెంటు తరువాత ఇక ఏ ఉద్యోగమూ ఉండదు
  • ఇక ప్రభుత్వంపై బురద చల్లే పని చేస్తారు

ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన కొందరు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై పుస్తకాలు రాస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఆయన అమరావతిలోని ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ... "కొంతమంది ఉద్యోగాలు లేనివారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అలాంటోళ్లు కూడా తయారయ్యారు.. ఇక్కడ పనిచేస్తారు... రిటైర్మెంటు తరువాత ఇక ఏ ఉద్యోగమూ ఉండదు. ఇక ప్రభుత్వంపై బురద చల్లే పని చేస్తారు.

ఉద్యోగంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్రభుత్వం అంటూ సంతకాలు పెడతారు. రిటైర్ అయిన తరువాత 'మన రాజధానిగా అమరావతి ఉండకూడదు.. ఇంకొకటి కావాలని' అంటారు. పరిపాలన గురించి నాకు చెబుతారా వీళ్లు..? ఓ పద్ధతి ఉండాలి. వీళ్లు సర్వీసులో ప్రజల కోసం ఏం చేశారన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. టీడీపీ ప్రజల పక్షాన ఉంటుంది. వ్యక్తిగత అజెండా, స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటివి చేస్తున్నారు వీళ్లు" అంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News