: రాహుల్ తో ముగిసిన కాంగ్రెస్ ఎంపీల భేటీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ఎంపీల సమావేశం ముగిసింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే, ఆ ప్రాంతంలో 15 స్థానాల్లో పార్టీని గెలిపిస్తామని తెలంగాణ ఎంపీలు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో సమస్యలపైనా వారు రాహుల్ తో చర్చించారు. త్వరలో రాహుల్ తెలంగాణ ప్రాంత ఎంపీలతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు తెలిపారు.