: జగన్ కు బెయిల్ రాకపోవడం బాబు చలవే: జూపూడి
అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీం కోర్టు తాజాగా బెయిల్ నిరాకరించడంపై వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు నిరాశ వ్యక్తం చేశారు. జగన్ కు బెయిల్ వస్తుందని భావించామని, అయినా, సుప్రీం నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. కాగా, గత రెండ్రోజులుగా ఢిల్లీలో ఉన్న బాబు జగన్ కు బెయిల్ విషయంలో కుట్రకు పాల్పడ్డారని చెప్పారు. పనేమీ లేకున్నా తన అనుయాయులతో హోటల్ లో తిష్ట వేసిన బాబు బెయిల్ కు వ్యతిరేకంగా మంత్రాంగం నడిపాడని జూపూడి చెప్పారు. సెప్టెంబర్ 9 తర్వాత మరోసారి బెయిల్ కోసం ప్రయత్నిస్తామని జూపూడి వెల్లడించారు.