: రాష్ట్రంపై రాహుల్ దృష్టి
కర్ణాటకలో గెలుపు పోరాటం ముగిసిపోవడంతో.. కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంపై దృష్టి సారించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ కూడా ఇందులో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీలోని అసమ్మతి, అసంతృప్త స్వరాలు సద్దుమణుగుతాయని భావిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వంలోనూ మార్పులు జరగొచ్చని, మంత్రి వర్గ విస్తరణకు అవకాశం ఉంటుందని అంటున్నారు.