Hyderabad: హైదరాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మధ్య వాగ్వివాదం
- కూకట్‌పల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలు
- జిల్లా కలెక్టర్‌పై సర్వే సత్యనారాయణ ఆరోపణలు
- టీఆర్ఎస్కి అనుకూలమని వ్యాఖ్యలు
- మండిపడ్డ ఎమ్మెల్యే కృష్ణారావు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తూ... జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కృష్ణారావు అంబేద్కర్ సభలో రాజకీయాలు వద్దని హితవు పలుకుతూ వాగ్వివాదానికి దిగారు. అక్కడ ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ హోరెత్తించారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కలుగజేసుకుని కార్యకర్తలను అదుపులోకి తెచ్చారు.