Rahul Gandhi: వారి ప్రేమబంధం మరింత బలోపేతం కావాలి: 'ఐఏఎస్' జంట వివాహంపై రాహుల్ గాంధీ

  • 2015 ఐఏఎస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన టీనా దబీ
  • అదే పరీక్షలో రెండో ర్యాంకర్ అత్తార్ ఆమిర్‌ ఖాన్
  • ఇటీవల ప్రేమ వివాహం
  • భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలన్న రాహుల్

దళిత వర్గానికి చెందిన టీనా దబీ అనే 24 ఏళ్ల యువతి 2015లో ఐఏఎస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అదే పరీక్షలో రెండో ర్యాంక్ సాధించిన కశ్మీర్‌కు చెందిన యువకుడు అథర్ ఆమిర్‌ ఉల్ షఫీ (25)ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. దక్షిణ కశ్మీర్‌లో పెద్ద సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. వారికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

వారి ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్న రాహుల్‌ గాంధీ.. అసహనం, విద్వేషం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నానని, గాడ్‌ బ్లెస్‌ యూ అని రాహుల్‌ పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోని కేంద్రసిబ్బంది శిక్షణా సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు వీరు ప్రేమలో పడ్డారు. మొదట వీరి ప్రేమపై విమర్శలు కూడా వచ్చాయి.

  • Loading...

More Telugu News