Chandrababu: ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలవడంపై చంద్రబాబు సందిగ్ధం.. తప్పేమీ లేదన్న సోమిరెడ్డి

  • నేడు,రేపు ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ
  • పలు పార్టీల నేతలను కలవనున్న సీఎం
  • హోదా కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందిగ్ధావస్థలో చిక్కుకున్నారు. మంగళ, బుధవారాల్లో పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వివిధ పార్టీల నేతలను కలవనున్న చంద్రబాబునాయుడు కాంగ్రెస్ నేతలను కలవడంపై ఆలోచనలో పడ్డారు. సోమవారం రాత్రి ఇదే అంశంపై నిర్వహించిన టీడీపీ శాసనసభా పక్ష సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది కాబట్టి, ఆ పార్టీ నేతలను కలవడంలో తప్పులేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కూడా ఏపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఆ పార్టీని కూడా కలవాలని మరికొందరు నేతలు సూచించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తాను టీడీపీ అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లడం లేదని, ముఖ్యమంత్రిగా వెళ్తున్నానని తెలిపారు. ఇది ముమ్మాటికీ హక్కుల సాధన యాత్రేనని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినవి సాధించుకోవడానికి ఎంత వరకు వెళ్లాలో అంత వరకూ వెళ్దామని తేల్చి చెప్పారు.  రాష్ట్రం కోసం కేంద్ర మంత్రి పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్న టీడీపీ త్యాగాన్ని ప్రజలు గుర్తించారని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News