Chandrababu: ఎస్సీలతో సమానంగా బుడగ జంగాలకు వసతులు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు
- బుడగ జంగాల మహాసభలో పాల్గొన్న చంద్రబాబు
- పిల్లల చదువుకు ఆర్థిక సాయం చేస్తాం
- బుడగ జంగాల్లో కళాకారులకు రూ. వెయ్యి పెన్షన్ ఇస్తాం
- రిజర్వేషన్లలో న్యాయం జరిగేలా కృషి చేస్తా : చంద్రబాబు
ఎస్సీలతో సమానంగా బుడగ జంగాలకు వసతులు కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. సీఎం నివాసం దగ్గర బుడగ జంగాల మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎస్సీలకు ఇళ్లు ఇచ్చిన తరహాలోనే బుడగ జంగాలకు నివాస ప్రాంతాలు ఏర్పాటు చేస్తామని, పేద బుడగ జంగాలకు ఆర్థిక సాయం అందిస్తామని, వారి పిల్లలు చదువుకునే నిమిత్తం ఆర్థిక సాయం చేస్తామని, బుడగ జంగాల్లో కళాకారులకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని, ఆ కులస్తులకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని, రిజర్వేషన్లలో బుడగ జంగాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.