: వంటగ్యాస్ కు ఆధార్ గడువు పొడిగింపు
వంటగ్యాస్ కు ఆధార్ అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. అక్రమాల నిరోధం కోసమే వంటగ్యాస్ ను ఆధార్ కు అనుసంధానం చేయాలని నిర్ణయించామని ఆమె ఢిల్లీలో చెప్పారు.
ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ పూర్తికాలేదు. దాంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతుండడంతో ఆధార్ గడువు పొడిగించాలని రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఈ ఆదేశాలు జారీ చేసింది.