palestiana: పాలస్తీనా ప్రధాని కాన్వాయ్ పై ‘హమస్’ మిలిటెంట్ల బాంబు దాడి!
- గాజా ప్రాంతంలో సంఘటన
- పాలస్తీనా ప్రధాన మంత్రి రమి హమదల్లా సురక్షితం
- ఏడుగురు వ్యక్తులకు గాయాలు..మూడు వాహనాలు ధ్వంసం
పాలస్తీనా ప్రధాన మంత్రి రమి హమదల్లా కాన్వాయ్ పై బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఏడుగురు వ్యక్తులకు మాత్రం గాయాలైనట్లు భద్రతా సిబ్బంది తెలిపింది. ఈ సంఘటనలో మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది. హమస్ మిలిటెంట్ గ్రూప్ అధీనంలో ఉన్న గాజా ప్రాంతంలోకి ఆయన ప్రవేశించగానే పేలుడు సంభవించిందని, ఈ ఘటనకు హమస్ మిలిటెంట్ సంస్థ పాల్పడినట్టు తెలుస్తోందని పాలస్తీనా అధికార వర్గాలు తెలిపాయి. హమదల్లా సురక్షితంగా ఉన్నారని, ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొన్నాయి. ఈ ఘటనపై హమదుల్లా స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా కూడా పట్టించుకోమని, పాలస్తీనా ఐకమత్యానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.