Andhra Pradesh: తీవ్ర ఉత్కంఠ .. వర్ల రామయ్య స్థానంలో కనకమేడల?
- టీడీపీకి ముప్పై ఏళ్లుగా సేవలందిస్తున్న కనకమేడల రవీంద్ర కుమార్
- ప్రస్తుతం టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల
- రాజ్యసభ ఎంపీ పదవి ఆయనకు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం?
ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయమై కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ను రాజ్యసభలో కొనసాగించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. రాజ్యసభకు రెండో అభ్యర్థిగా టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత వర్ల రామయ్యను ఎంపిక చేస్తారనే వార్తలు వెలువడ్డాయి. కానీ, వర్ల రామయ్య స్థానే కనకమేడల రవీంద్ర కుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కాగా, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా కనకమేడల కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. దాదాపు ముప్పై ఏళ్లుగా పార్టీకి ఆయన సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు కనకమేడల రవీంద్రకుమార్ కు ఎటువంటి పదవి ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ పదవి ఆయనకు ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం
నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.