: వివాదంపై స్పందించిన రామ్ చరణ్
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లపై దాడి ఘటన పట్ల హీరో రామ్ చరణ్ స్పందించాడు. తన దృష్టిలో పడేందుకు వారిద్దరూ చాలా వేగంగా డ్రైవింగ్ చేశారని, అదే వివాదానికి కారణమైందని రామ్ చరణ్ వివరణ ఇచ్చాడు. ముంబయిలో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనపై సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఇద్దరూ పోలీసులకు క్షమాపణ లేఖ ఇచ్చారని వెల్లడించాడు. అందుకే పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పాడు. ఈ ఉదంతంలో పోలీసులు పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించారని ప్రశంసించాడు. ఇదిలావుంటే, తమకు బాధితుల నుంచి ఎలాంటి క్షమాపణ పత్రం అందలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.