: ట్విట్టర్లోనూ సిద్ధరామయ్య హవా
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఎన్నికల్లోనే కాదు, ట్వీట్స్ విషయంలోనూ విజేతగా నిలిచారు. నేడు ఓట్ల లెక్కింపు దినం కాగా, ట్విట్టర్లో ఈ ఒక్కరోజే ఆయనపై 3611 కామెంట్స్ వచ్చాయట. ఈ విషయంలో సిద్ధరామయ్య.. యడ్యూరప్ప, ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్, జేడీఎస్ నేత కుమారస్వామి తదితరులను వెనక్కినెట్టారు. సిద్ధరామయ్య తర్వాతి స్థానాల్లో వరుసగా యడ్యూరప్ప (3011), షెట్టర్ (2043), కుమారస్వామి (1241) నిలిచారు.