Chandrababu: అపోలో ఆసుపత్రిలో కొత్తపల్లి సుబ్బారాయుడు, హరీశ్వర్ రెడ్డిలను పరామర్శించిన చంద్రబాబు
- ఇటీవల అస్వస్థతకు గురైన నేతలు
- హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు
- వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న టీడీపీ అధినేత
ఇటీవల అనారోగ్యానికి గురైన టీడీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారాయుడిని కలిసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా, అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని కూడా చంద్రబాబు పరామర్శించారు.