Andhra Pradesh: ఏపీలో ఇద్దరు టీడీపీ కౌన్సిలర్ల రాజీనామా

  • మదనపల్లెలో టీడీపీ కౌన్సిలర్లు సుమంత్, తులసి రాజీనామా
  • మునిసిపల్ కమిషనర్ కు రాజీనామా లేఖల అందజేత
  • వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారు
  • అందుకే, రాజీనామా చేశాం : సుమంత్, తులసి

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మునిసిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు సుమంత్, తులసి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను మునిసిపల్ కమిషనర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ వార్డుల్లో అభివృద్ధికి పురపాలక సంఘం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే, తమ పదవులకు రాజీనామా చేశామని చెప్పారు. కాగా, అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News