: పీఠం కోసం రాహుల్ భజన మొదలెట్టిన సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి పీఠానికి పోటీపడుతున్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అప్పుడే రాహుల్ పల్లవి అందుకున్నారు. రాష్ట్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ మంత్రం పనిచేయలేదని, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని సిద్ధరామయ్య చెప్పారు. రాహుల్ ప్రచారం చేసిన ప్రతీ చోటా కాంగ్రెస్ కు మంచి పలితాలు వస్తున్నాయని చెప్పారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లో రాహుల్ ప్రచారంలోనే కాంగ్రెస్ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే! ఈ విషయం సిద్ధరామయ్యకు కూడా తెలుసు.. కానీ, పీఠం కోసం రాహుల్ ను కీర్తించడం మొదలెట్టారు. పనిలో పనిగా తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు వారం రోజులైనా పడుతుందన్నారు.