Andhra Pradesh: ఏపీ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్త
- వామపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్
- బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్త రోశయ్య
- ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
ఏపీపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఏపీలో వామపక్షాలు ఈరోజు బంద్ తలపెట్టాయి. విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక లెనిన్ సెంటర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ బంద్ కు తన మద్దతు తెలిపారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఈ పోరాటానికి తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు తెలపాలని కోరతానని అన్నారు.
కాగా, ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.