Jagan: ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యత’ పేరిట వైసీపీ పోస్టర్

  • 75వ రోజుకు చేరుకున్న ప్రజాసంకల్పయాత్ర
  • వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత
  • పోస్టర్ ను ఆవిష్కరించిన జగన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర  నేటికి 75వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రెండో రోజు జగన్ తన పాదయాత్రను కొనసాగించారు. సైదాపూర్ శివారు నుంచి ఈ రోజు ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. సిద్దలయ్యకోన, ఊటుకూరు మీదుగా తురిమెర్లకు ఆయన చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

 కాగా, ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యత’ పేరిట ఓ పోస్టర్ ను జగన్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ను జగన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చట్ట సభల్లో రాజకీయ ప్రాధాన్యం లభించని బీసీ సామాజిక వర్గాలు అనేకం ఉన్నాయి. వారందరికీ రాజకీయ ప్రాధాన్యత లభించినప్పుడే వారి సమస్యలు చట్టసభల్లో వినిపిస్తాయి. ఆ సామాజికవర్గం ఆర్థిక, సామాజిక పురోభివృద్ధిని సాధించగలుగుతుంది’ అని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News