Jagan: వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర
- నెల్లూరు జిల్లాలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటిన ప్రజా సంకల్పయాత్ర
- ఈ సందర్భంగా పైలాన్ ని ఆవిష్కరించిన వైసీపీ అధినేత
- జగన్ ని అభినందించిన పార్టీ కార్యకర్తలు, ప్రజలు
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు జగన్ ని అభినందించారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సైదాపురంలో పైలాన్ ను జగన్ ఆవిష్కరించారు. కాగా, వైసీపీ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జగన్ కు బాసటగా ‘వాక్ విత్ జగన్’ అంటూ వేలాది మంది పాదయాత్రలు నిర్వహించారు.