Chandrababu: ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు సూపర్!: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ కితాబు
- చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు
- ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యం ఆయన సొంతం
- చంద్రబాబులో ఇప్పటికీ అదే స్పీడ్, పట్టుదల, ఓపిక
- మీడియాతో బాబుమోహన్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాబుమోహన్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడని, ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని ముందుకు పోగల ధైర్యం ఆయన సొంతమని అన్నారు. గతంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో కలిసి పని చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.
నాడు ఆయనతో కలిసి పని చేసిన రోజుల్లో చంద్రబాబు పనితనాన్ని దగ్గరగా చూసేవాడినని, ఇప్పటికీ అదే స్పీడ్, పట్టుదల, ఓపిక ఆయనలో ఉన్నాయని అన్నారు. చంద్రబాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘సూపర్’, ‘బ్రహ్మండం’ అని కితాబిచ్చారు. కాగా, విజయనగరంలో వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం బాబుమోహన్ నిన్న ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.