kcr: సీఎం క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించిన కేసీఆర్ దంపతులు!
- ప్రగతిభవన్ లో ప్రత్యేక పూజలు
- ఈ విషయాన్ని ‘ఫేస్ బుక్’ లో పేర్కొన్న సీఎం కేసీఆర్
- ఫొటోలూ పోస్ట్ చేసిన ముఖ్యమంత్రి
సంస్కృతీసంప్రదాయలు, పూజలు పునస్కారాలు, యజ్ఞయాగాదులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయం(ప్రగతి భవన్)లో ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఫొటోలను పోస్ట్ చేశారు.