Telangana: పాతబస్తీకి ముఖ్యమంత్రి అసదుద్దీన్, ఉపముఖ్యమంత్రి అక్బరుద్దీన్!: సీపీఐ నారాయణ వ్యంగ్యాస్త్రాలు
- కేసీఆర్ తెలంగాణ అంతటికి ముఖ్యమంత్రా?
- పాతబస్తీకి ఒవైసీ కుటుంబం నుంచి విముక్తి కలగలేదు
- మంత్రి కేటీఆర్ కు ఎయిర్ పోర్టుపై ఉన్న ప్రేమ, పాతబస్తీపై లేదు
- వ్యంగ్యాస్త్రాలు సంధించిన సీపీఐ నారాయణ
సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు విముక్తి కలిగినా, హైదరాబాద్ లోని పాతబస్తీకి ఒవైసీ కుటుంబం నుంచి మాత్రం విముక్తి కలగలేదని సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'పాతబస్తీకి ముఖ్యమంత్రి అసదుద్దీన్, ఉపముఖ్యమంత్రి అక్బరుద్దీన్' అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. కేసీఆర్ తెలంగాణ అంతటికి ముఖ్యమంత్రా? లేక పాతబస్తీకి ఏమైనా మినహాయింపు ఉందా? అంటూ నారాయణ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ కు ఎయిర్ పోర్టుపై ఉన్న ప్రేమ, పాతబస్తీపై లేదని విమర్శలు గుప్పించారు.