Chandrababu: చంద్రబాబు గారూ! ప్రజలు మీకెందుకు ఓటేయాలి?: అంబటి రాంబాబు

  • ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రజలకు మీరేం చేశారు?
  • పోలవరం ప్రాజెక్ట్ కు సమాధి కట్టినందుకు మీకు ఓటు వేయాలా?
  • చంద్రబాబుపై మండిపడ్డ అంబటి

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల విచిత్ర వ్యాఖ్యలు చేశారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, "వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లోనూ గెలుస్తుందని, ఏదైనా ఒకట్రెండు నియోజకవర్గాల్లో కనుక ఓడిపోతే అందుకు ప్రజలు సిగ్గుపడాలని.. ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆయన మరోమాట కూడా అన్నారు.. తను చేస్తున్న కష్టానికి కూలీగా ప్రజలు ఓటు వేయాలట. రాష్ట్రాభివృద్ధి కోసం మూడున్నరేళ్లు ఆయన తీవ్రంగా కష్టాపడ్డారట! ఆ కష్టానికి ప్రతిఫలంగా కూలీ కింద ఓట్లు వేయాలట! వారికి ఓట్లు వేయని ప్రజానీకం సిగ్గుపడే పరిస్థితి వస్తుందట. ‘చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా! మీకసలు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలి? ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రజలకు మీరేం చేశారు? ఒక సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజధాని కట్టారా? రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. మాఫీ చేశారా? ఎందుకు మీకు ఓటు వేయాలి? పోలవరం ప్రాజెక్ట్ కు సమాధి కట్టినందుకు మీకు ఓటు వేయాలా?’ అని అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News