Nara Lokesh: 9 నెలల్లో 24వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ లైన్ ఓ ప్రపంచ రికార్డ్: నారా లోకేశ్

  • రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన 5 గ్రిడ్స్ లో ఫైబర్ గ్రిడ్ ఒకటి
  • ఆంధ్రప్రదేశ్ ని అన్ని రాష్ట్రాలూ ఓ మోడల్ గా తీసుకునే విధంగా అభివృద్ధిపరుస్తాం
  • వైర్ లెస్ టెక్నాలజీతో మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా నెట్
  • ఐటీలో గతంలో హైదరాబాద్ లో చంద్రబాబు చరిత్ర సృష్టించారు.. ఇప్పుడు ఏపీలో  

రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన 5 గ్రిడ్స్ లో ఫైబర్ గ్రిడ్ ఒకటని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఈ రోజు అమ‌రావ‌తిలో ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ని అన్ని రాష్ట్రాలూ ఓ మోడల్ గా తీసుకునే విధంగా అభివృద్ధిపరుస్తున్నట్లు చెప్పారు. 9 నెలల్లో 24 వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ లైన్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించినట్లు తెలిపారు.

వైర్ లెస్ టెక్నాలజీతో మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా నెట్ అందుబాటులోకి తెస్తామని లోకేశ్ చెప్పారు. కేవలం రూ.149 రూపాయలకు ఇంటర్ నెట్, టెలీఫోన్ తోపాటు 250 ఛానల్స్ తో కేబుల్ టీవీ అందిస్తున్నట్లు తెలిపారు. 2018 డిసెంబర్ నాటికి కేంద్రం మంజూరు చేసే రూ.860 కోట్లతో ప్రతి మున్సిపాలిటీకీ, ప్రతి పంచాయతీకి వైఫై కనెక్షన్ ఇస్తామన్నారు. ఐటీలో గతంలో హైదరాబాద్ లో చరిత్ర
సృష్టించిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలో చరిత్ర సృష్టించనున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News