: దర్శకనిర్మాతను పెళ్ళాడనున్న దియా మీర్జా


బాలీవుడ్ తార దియా మీర్జా.. దర్శకనిర్మాత సాహిల్ సంగాతో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో పరిమితంగా చిత్రాల్లో నటిస్తున్న దియా.. ఢిల్లీలో ఓ అవార్డు స్వీకరించేందుకు విచ్చేసిన సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. పనిలోపనిగా తన పెళ్ళివార్త విలేకరుల చెవినపడేసింది. వచ్చే ఏడాది ఆరంభంలో తన వివాహం ఉంటుందని దియా అంటోంది. నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా తన పరిణయం ఉంటుందని ఈ హైదరాబాదీ అమ్మడు చెబుతోంది.

దియా తాజాగా 'లవ్ బ్రేకప్స్ జిందగీ' చిత్రంలో నటిస్తోంది. ఇక పెళ్ళయిన తర్వాత కూడా నటిస్తారా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ, 'తప్పకుండా నటిస్తాను. భారతీయ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వస్తోంది. వివాహిత నటీమణులను కూడా వారు ఆదరిస్తున్నారు. అందుకు నా సన్నిహితురాలు విద్యా బాలన్ మంచి ఉదాహరణ. ఆమె వివాహం తర్వాత కూడా నటిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది కదా' అని వివరించింది.

  • Loading...

More Telugu News