Chandrababu: జన్మనిచ్చిన ఊళ్లకు రండి.. జన్మభూమికి సేవ చేయండి: ప్రవాసాంధ్రులకు చంద్రబాబు పిలుపు

  • ‘జన్మభూమి-మా ఊరు’పై సమీక్షించిన చంద్రబాబు
  • జనవరి 2 నుంచి ప్రారంభం
  • అభివృద్ధి ఫలాలు చివరి గడపకు కూడా అందాలన్నదే లక్ష్యమన్న సీఎం

జన్మనిచ్చిన ఊరికి వచ్చి జన్మభూమికి సేవ చేయాలని ప్రవాసాంధ్రులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. జనవరి 2 నుంచి జరగనున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై శనివారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి రగిలించే కార్యక్రమమని అన్నారు. ముఖ్యంగా స్థానిక వ్యవహారాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే కార్యక్రమమని పేర్కొన్నారు. ఇందులో ఐదు లక్షల పంట కుంటల్ని జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్క గడపకు అందాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు.

‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమ లక్ష్యాలు, వివరాలను ప్రణాళిక కార్యదర్శి సంజయ్ గుప్తా, పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖామంత్రి లోకేశ్‌లు చంద్రబాబుకు వివరించారు. కార్యక్రమం చివరి రోజు ఆటపాటలు, వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అలాగే గ్రామాల నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారిని సన్మానించనున్నారు. ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News