రామ్ గోపాల్ వర్మ: నా తాట తీస్తాననేవాళ్ల మాటలు వింటుంటే నాకు ముద్దొస్తోంది!: రామ్ గోపాల్ వర్మ
- ప్రజలు చూస్తున్నారు కాబట్టే ఇలాంటివి తీస్తున్నాం
- మేము తీస్తున్నాం కాబట్టి ప్రజలు చూస్తున్నారనడం కరెక్టు కాదు
- ఈ వెబ్ సిరీస్ సుమారు 30 గంటలు ఉండొచ్చు
తన తాట తీస్తాననేవాళ్ల మాటలు వింటుంటే తనకు ముద్దొస్తోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కడప’ వెబ్ సిరీస్ విషయమై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లలు వార్నింగ్ ఇస్తే ముద్దొస్తుందిగా, అదే విధంగా, తనకు వార్నింగ్ ఇచ్చే వాళ్లను చూస్తున్నా అలాగే అనిపిస్తోందంటూ నవ్వులు చిందించారు.
ప్రజలు చూస్తున్నారు కాబట్టే ఇలాంటి వెబ్ సిరీస్ లేదా సినిమాలు తీస్తున్నామనేది వంద శాతం కరెక్టని, తాము తీస్తున్నాం కాబట్టి ప్రజలు చూస్తున్నారనడం కరెక్టు కాదని స్పష్టం చేశారు. ‘కడప’ వెబ్ సిరీస్ రెడ్ల చరిత్ర అన్నాను గానీ, వారు ‘బ్యాడ్’ అని తాను చెప్పలేదని, కొంతమంది ‘రెడ్ల’కు సంబంధించిన కథ ఈ సిరీస్ అని, ఈ వెబ్ సిరీస్ సుమారు 30 గంటలు ఉండొచ్చని చెప్పారు.