: ఢిల్లీలో చంద్రబాబుకు చికిత్స


వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో శారీరకంగా ఎంతో అలసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. 63 ఏళ్ళ వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల మేర రాష్ట్రవ్యాప్తంగా నడక సాగించిన బాబు.. యాత్ర చరమాంకంలో అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా కాలినొప్పి ఆయన్ను వేధించింది. వైద్యులు పాదయాత్ర నిలిపివేయమన్నా బాబు లక్ష్యపెట్టక మొండిగా ముందుకు నడిచారు.

పాదయాత్ర ముగిసిన తర్వాత వైద్య సేవల కోసం అమెరికా వెళతానని ప్రకటించిన బాబు.. ప్రస్తుతం ఢిల్లీలోని వర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజధాని వచ్చిన బాబు రేపటి వరకు ఇక్కడే ఉండి కాలునొప్పికి చికిత్స పొందుతారు.

  • Loading...

More Telugu News