సిరివెన్నెల సీతారామశాస్త్రి: పవన్ కల్యాణ్ కూర్చుని ఉండగా నేను మాట్లాడటం ఎలా ఉంటుందంటే..!: సిరివెన్నెల సీతారామశాస్త్రి

  • సునామీలో పిల్లన గ్రోవి వాయించడం లాంటిది
  • ఈ సినిమా కలెక్షన్ల సునామీ సాధిస్తుంది
  • ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో సీతారామశాస్త్రి

పవన్ కల్యాణ్ కూర్చుని ఉండగా తాను మాట్లాడటమనేది సునామీలో పిల్లనగ్రోవి వాయించడం లాంటిదని ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చమత్కరించారు. ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇది దర్శకుడు త్రివిక్రమ్ సంధించి విసిరిన కల్యాణాస్త్రం అని, పవనాస్త్రం అని.. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సాధిస్తుందని కోరుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని, సంగీత దర్శకుడు అనిరుథ్ కు తన శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.

అనంతరం, సినీ నటి ఖుష్బూ మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత తాను తెలుగు సినిమాలో మళ్లీ నటిస్తున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని, తెలుగులో తన చివరి చిత్రం ‘స్టాలిన్’ అని అన్నారు. ఈ పదేళ్లలో తనకు చాలా ఆఫర్లు వచ్చాయని, అయితే ప్రాముఖ్యత ఉన్న సినిమాల కోసం ఎదురు చూశానని చెప్పారు.

‘అజ్ఞాతవాసి’ చిత్రంలో తాను నటిస్తే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పడంతో, తాను తిరస్కరించలేకపోయానని అన్నారు. పవన్ కల్యాణ్ నటించిన ఓ చిత్రంలో తనకు మంచి పాత్ర లభించడం, పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా ద్వారా తెలుగు  ప్రేక్షకుల ముందుకు రానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ లపై ప్రశంసలు కురిపించారు. జనవరి 10న బిగ్గెస్ట్ ధమాకాతో ప్రేక్షకుల ముందుకు రానున్నామని ఖుష్బూ చెప్పారు.

  • Loading...

More Telugu News