యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్: అందుకే, చంద్రబాబుకు, నాకూ మధ్య గ్యాప్ వచ్చింది: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

  • నాడు చంద్రబాబునాయుడు నాకు రాజ్యసభ సీటివ్వలేదు 
  • నేను ఎంపీ అవడానికి కారణం నందమూరి హరికృష్ణే
  • ఓ ఇంటర్వ్యూలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

నాడు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం రావడానికి కారణం నందమూరి హరికృష్ణే నని, ఆయన పట్టుబడితే చంద్రబాబు తనకు ఆ పదవి ఇచ్చారని ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ‘ఏబీఎన్-ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ లో ఆయన మాట్లాడుతూ, ‘అప్పుడు చంద్రబాబునాయుడు గారు నాకు రాజ్యసభ సీటివ్వలేదు. మనకి, మన పార్టీకి మంచిదని హరికృష్ణ పట్టుబడితే నాడు రాజ్యసభ సీటు నాకు వచ్చింది. నేను ఎంతో నిజాయతీగా పనిచేసి, చాలా నమ్మకంగా ఉన్నాను.

అయితే, హరికృష్ణకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వమని చంద్రబాబును నేను అడిగాను. అందుకు, చంద్రబాబు నాయుడు గారు..‘నీకు తెలియదులే. చాలా ఉన్నాయి. అయినా, హరికృష్ణ  నీకు దగ్గరా? నాకు దగ్గరా? మా బావమరిది’ అని అన్నారు. ఆ తర్వాత కొంత సంభాషణ జరిగింది. ‘నేను హరికృష్ణకు కృతజ్ఞుడిని. ఆయనకు మంత్రి పదవి లేకుండా.. నేను పదవిలో కొనసాగడం మర్యాదగా ఉండదు’ అని నేను చెప్పాను.

‘హిందీ వచ్చు, పదిమందితో మీకు పరిచయాలు ఉన్నాయి. రాజ్యసభలో నాయకుడిని చేస్తాను’ అని చంద్రబాబుగారు అన్నారు. ఇందుకు నేను స్పందిస్తూ, ‘సార్, మీరు హరికృష్ణను మంత్రిని చేయండి. నేనొచ్చి పార్టీ ఆఫీసు ఊడ్వమన్నా ఊడుస్తా...’ అని చెప్పాను. ఈ క్రమంలో చంద్రబాబునాయుడుగారికి, నాకు మధ్య గ్యాప్ వచ్చేసింది’ అని యార్లగడ్డ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News