మోహన్ బాబు: తెలుగు మహాసభలు అత్యద్భుతం: ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రశంసలు

  • ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చెప్పడం కోసం ఈ సభలు
  • సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు
  • ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న మోహన్ బాబు

ప్రపంచ తెలుగు మహాసభలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రశంసించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని, ప్రతి ఒక్కరికీ దానిని జ్ఞాపకం చేయడం కోసం ఎంతో ఘనంగా ఈ సభలను నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

కళాకారులను సన్మానిస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి కళాకారుడిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, ఆహ్వానిస్తున్న కేటీఆర్ కు తన ధన్యవాదాలని చెప్పారు. కాగా, ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ కేటీఆర్ ను 'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో సత్కరించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ ని తాను సన్మానిస్తానంటూ చెప్పి, ఆయన్ని మోహన్ బాబు సభాముఖంగా సన్మానించారు.

  • Loading...

More Telugu News