ఎన్టీఆర్: గుండు చేయించుకుని.. ఎన్టీఆర్ అభిమానుల వినూత్న నిరసన!

  • తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ పేరిట స్వాగత ద్వారం లేకపోవడం తగదు
  • కనీసం ఆయన ఫొటో కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదు
  • కృష్ణా జిల్లా గరికపాడులో ఎన్టీఆర్ అభిమానుల నిరసన

ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలుగు మహాసభల విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేసే విధంగా మహనీయుల పేరిట స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే, టీడీపీ వ్యవస్థాపకుడు, నటదిగ్గజం ఎన్టీఆర్ పేరిట స్వాగత ద్వారం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గరికపాడులో ఎన్టీఆర్ అభిమానులు గుండు గీయించుకుని తమ నిరసన తెలిపారు. తెలుగుకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత కల్పించిన ఎన్టీఆర్ ను విస్మరించారని, కనీసం ఎన్టీఆర్ ఫొటో కూడా ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం కరెక్టు కాదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News