సీఎం చంద్రబాబు: డ్యాష్ బోర్డులో చూసి అంతా బాగుందనుకోవద్దు: సీఎం చంద్రబాబుతో జేపీ

  • చంద్రబాబును కలిసిన ‘లోక్ సత్తా’ జయప్రకాష్ నారాయణ
  • సురాజ్య ఉద్యమంలో తన అనుభవాలను పంచుకున్న వైనం 
  • విద్య, వైద్య రంగాలకు సద్వినియోగపడని ప్రభుత్వ నిధులు  

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ కలిశారు. ఈ సందర్భంగా సురాజ్య ఉద్యమంలో తన అనుభవనాలను చంద్రబాబుకు ఆయన వివరించారు. విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వ నిధులు సద్వినియోగం కావడం లేదని, డ్యాష్ బోర్డులో చూసి అంతా బాగుందనుకోవద్దని చంద్రబాబుతో అన్నారు. కాగా, సమాజంలో మార్పు కోసం ‘లోక్ సత్తా’ ఆధ్వర్యంలో ఆయన సురాజ్య ఉద్యమం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్వాతంత్ర్య సమరయోధుల పార్క్ లో సెప్టెంబర్ లో సురాజ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News