మంత్రి దేవినేని: అసెంబ్లీలో చెప్పే సమాచారం భగవద్గీత, బైబిల్, ఖురాన్ తో సమానం: మంత్రి దేవినేని

  • ‘పోలవరం’కు సంబంధించిన అన్ని వివరాలు అసెంబ్లీలో చెప్పా
  • ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నాకు లంచమిచ్చిందనేది అబద్ధం  
  • మంత్రి దేవినేని ఉమ

అసెంబ్లీలో చెప్పే సమాచారం పవిత్ర గ్రంథాలతో సమానమని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పోలవరం’ కు సంబంధించి ఓ శ్వేతపత్రం విడుదల చేయమని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై దేవినేనిని ప్రశ్నించగా, ‘పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని వివరాలు అసెంబ్లీలో చెప్పాను. ఇక్కడ చెప్పే సమాచారం ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ తో సమానం. ఈ సమాచారమంతా శాసనసభలో, శాసనమండలిలో పెట్టాను’ అని అన్నారు.

‘దేవినేని ఉమకు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వాళ్లు వందలాది కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చింది అనే ఆరోపణలు వస్తున్నాయి?’ అనే ప్రశ్నకు ఉమ స్పందిస్తూ, ‘లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు నేను ఎలా తీసుకుంటాను? ఎంత బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తున్నారు! ఈరోజున బల్లగుద్ది మరీ లెక్కలు స్పష్టంగా చెప్పగలుగుతున్నామంటే.. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, చిత్తశుద్ధితో, నిర్భయంగా, నిజాయతీగా పని చేస్తోందో తెలుస్తోంది’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News