పోలాండ్ అబ్బాయి: పోలాండ్ బాలుడు నోట అఖిల్ 'హలో' పాట.. నాగార్జున అక్కినేని ప్రశంస

  • ‘మెరిసే మెరిసే మెరిసే..’ పాట అద్భుతం
  • అఖిల్ డ్యాన్స్ చాలా బాగుంది
  • ఆ పాటను పాడటం నేర్చుకుని వీడియో పోస్ట్ చేసిన పోలాండ్ బాలుడు జిబిగ్జ్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘హలో’. ఈ చిత్రంలోని ‘మెరిసే మెరిసే మెరిసే..’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటను చూసిన పోలాండ్ అబ్బాయి జిబిగ్జ్ ఆ పాటను నేర్చుకుని, చక్కగా పాడాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మెరిసే మెరిసే మెరిసే..’ పాటలో అఖిల్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడని, పాట చాలా బాగుందని ప్రశంసించాడు. ఈ పోస్ట్ ను చూసిన ప్రముఖ నటుడు, అఖిల్ తండ్రి నాగార్జున అక్కినేని స్పందించాడు. జిబిగ్జ్ పాట పాడిన వీడియో అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. కాగా, ‘హలో’ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.


  • Loading...

More Telugu News