పవన్ కల్యాణ్: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటు స్పందన!
- వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ నేత
- వారసులమైనంత మాత్రాన తమకు సత్తాలేదనడం సరికాదు
- పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
విశాఖపట్టణం పర్యటనలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయా పార్టీలు, వారసత్వ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. వారసత్వంతో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, తమకంటూ ఓ గుర్తింపు ఉందని, రాజకీయ నాయకుల వారసులమైనంత మాత్రాన తమకు సత్తాలేదనడం సరికాదని అన్నారు.
ఓ అవకాశం వస్తేనే కదా తామేంటో నిరూపించుకునేదని అన్నారు. వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మంత్రి నారా లోకేశ్ పై పవన్ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు.